ఆసుపత్రిలో చేరిన పంజాబ్ సీఎం
NEWS Sep 06,2025 08:22 am
గత రెండు రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పి, జ్వరంతో బాధపడుతున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం సీఎం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో కాలి నడకన పర్యటించారు భగవంత్ మాన్.