తురకపాలెంలో హెల్త్ ఎమర్జెన్సీ : సీఎం
NEWS Sep 06,2025 08:05 am
గుంటూరు జిల్లా తురకపాలెంలో చోటు చేసుకున్న మరణాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే కేంద్ర వైద్య బృందాలు, ఎయిమ్స్ బృందాలను రప్పించాలని ఆదేశించారు. అందరి హెల్త్ ప్రొఫైల్స్‌ను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు చేయాలని, కొత్త కేసులు నమోదు కాకూడదని, అందరిలో నమ్మకం పెంచాలన్నారు. సోమవారంలోపు అందరి హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.