ఆ మూడు పార్టీలకు బీజేపీ అంటే భయం
NEWS Sep 06,2025 07:33 am
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మూడు పార్టీలు గల్లీలో గుద్దులాట, ఢిల్లీలో ముద్దులాట చేస్తాయంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్లు బీజేపీకి భయపడి బతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో అంటకాగిన వారు ఎవరూ బాగు పడ లేదన్నారు. రేపు టీడీపీ, జనసేన పార్టీలను కూడా బీజేపీ రెండుగా చీల్చుతుందంటూ హెచ్చరించారు.