సూర్య తేజ యూత్ ఆధ్వర్యంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం
NEWS Sep 06,2025 08:00 am
మెట్ పల్లి కళానగర్ సూర్య తేజ యూత్ అసోసియేషన్. వారి ఆధ్వర్యంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం చేశారు.1000 దీపాలతో, శివలింగం, ఓం, స్వస్తిక్ ఆకారంలో దీపాలు వెలిగించారు. ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా, సాయంత్రం మళ్ళీ నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సూర్య తేజ యూత్ కమిటీ సభ్యులు, మహిళా భక్తులు పాల్గొన్నారు.