సిద్ధపల్లిలో భూ నిర్వాసితుల ఆవేదన
NEWS Sep 05,2025 11:06 pm
పెద్దపల్లి జిల్లా మంథని మండలం అక్కేపల్లి గ్రామపంచాయితీ పరిధిలోని సిద్ధపల్లిలో సింగరేణి అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే, పరిహారం చెల్లించకుండా ఇండ్లు కూల్చివేయడంతో భూ నిర్వాసితులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇళ్లు కూల్చడాన్ని అడ్డుకున్న బాధితులు, తమకు నష్టపరిహారం తప్పనిసరిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంటి స్థలాలు, ఇళ్లకు తగిన పరిహారం అందించకపోతే పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.