గత వైసీపీ పాలనలో విద్యా రంగం ఆగమాగం
NEWS Sep 05,2025 07:46 pm
గత వైసీపీ పాలనలో విద్యా రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు మంత్రి లోకేష్. గురు పూజోత్సవంలో పాల్గొన్నారు. జగన్ రెడ్డి కారణంగా దాదాపు 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని వాపోయారు. టీచర్లను ఏకంగా వైన్ షాపుల ముందు కాపలా కాయడానికి పెట్టిన ఘటనలు చూశామన్నారు. జీతాలు కూడా ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. చివరకు ఎన్నికల డ్యూటీ నుంచి కూడా తప్పించాలని చూసిందన్నారు. కానీ తాము వచ్చాక సీన్ మారిందన్నారు.