కవిత వల్లనే బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చా
NEWS Sep 05,2025 07:42 pm
ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి కల్వకుంట్ల కవితనే కారణం అని ఆరోపించారు. ఒక సీఎం కూతురు లిక్కర్ స్కాం చేయడం, జైలుకు వెళ్లడం నాకు బాధ కలిగించిందన్నారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణపై పడి దోచుకుందన్నారు. దోచుకున్న డబ్బును పంచుకోవడంలో ఇబ్బంది వచ్చినందుకే ఈ పంచాయితీలు అంటూ మండిపడ్డారు.