55 రోజుల్లో 11000 టీచర్ పోస్టుల భర్తీ
NEWS Sep 05,2025 07:39 pm
గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో విద్యా రంగాన్ని పట్టించు కోలేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గురు పూజోత్సవంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు మూడు లక్షలు పెరిగిందని, ప్రస్తుతం 27,000 ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది పిల్లలు చదువుతున్నారని అన్నారు. 10,000 ప్రైవేట్ పాఠశాలల్లో 34 లక్షల మంది పిల్లలు చదువుతున్నారని పేర్కొన్నారు. విద్యా రంగం బలోపేతానికి కృషి చేస్తామన్నారు. మిగిలి పోయిన ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు.