చిట్వేల్ ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
NEWS Sep 05,2025 06:54 pm
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చిట్వేల్‌కు గౌరవప్రదమైన గుర్తింపు లభించింది. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆ పాఠశాల ఉపాధ్యాయులు పీ.రాజశేఖర్ (ఆంగ్లం), జి.శ్రీకాంతి (ఆంగ్లం), ఏ.శివనారాయణ (జీవశాస్త్రం)లు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై రాయచోటిలో జరిగిన గురుపూజోత్సవంలో అవార్డులు అందుకున్నారు. ఉపాధ్యాయుల కృషి పట్ల అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.