గిరిజన కుటుంబాలకు ఉచిత సిలిండర్
NEWS Sep 05,2025 05:35 pm
ఏపీ సర్కార్ ఖుష్ కబర్ చెప్పింది. గిరిజన కుటుంబాలకు ఉచితంగా సిలిండర్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు మంత్రి నాదెండ్ల మనోహర్. దీపం-2 పథకం కింద 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. దీని వల్ల 16 జిల్లాల్లోని 23,912 గిరిజన కుటుంబాలు లబ్ధి పొందుతాయని పేర్కొన్నారు. దీనికోసం ప్రభుత్వంపై రూ.5.54 కోట్ల భారం పడుతుందని తెలిపారు.