ఒకే ఫ్లైట్ లో వెళితే మిలాఖత్ అయినట్టా..?
NEWS Sep 05,2025 04:39 pm
సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత నోరు పారేసు కోవడం మంచిది కాదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎంతో మంది పొలిటికల్ లీడర్లు ఒకే ఫ్లైట్ లో జర్నీ చేస్తుంటారని, పలకరించు కోవడం షరా మామూలేనని అన్నారు. అంత మాత్రాన మిలాఖత్ అయినట్లు ఆరోపించచడం మంచి పద్దతి కాదన్నారు. ఇక నుంచి అలాంటి కామెంట్స్ చేయడం మానుకోవాలని హితవు పలికారు. ముందు తెలంగాణ పేరుతో కొల్లగొట్టిన కోట్లు ఎన్నో చెప్పాలన్నారు టీపీసీసీ చీఫ్.