ద్విచక్ర వాహనం గోతిలో పడి వ్యక్తికి తీవ్ర గాయాలు
NEWS Sep 05,2025 07:15 pm
ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఓ వ్యక్తికి గాయాలైన ఘటన మణుగూరు మండలంలో చోటు చేసుకుంది. కరకగూడెం మండలానికి చెందిన చందా అశోక్ ద్విచక్ర వాహనంపై మణుగూరు వెళ్తున్న క్రమంలో విజయనగరం పెట్రోల్ బంక్ వద్ద ద్విచక్ర వాహనం గుంటలో పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రమైన గాయాలు కావడంతో 108 సహాయంతో మణుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు .