నటి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలకు లుకౌట్ నోటీస్
NEWS Sep 05,2025 04:16 pm
వ్యాపారవేత్త కొఠారిని రూ. 60 కోట్ల మేర మోసం చేసిన కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, భర్త రాజ్ కుంద్రాలకు ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 2015, 2023 మధ్య వ్యాపార విస్తరణ కోసం ఉద్దేశించిన నిధులను వ్యక్తిగత ఉపయోగం కోసం మళ్లించారని భార్య భర్తలపై ఫిర్యాదు చేశారు బాధితుడు. ముంబై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 403, 406, 34 కింద FIR నమోదు చేశారు.