ఏపీలో వైద్య, ఆరోగ్య శాఖ ఉందా..?
NEWS Sep 05,2025 03:49 pm
ఏపీలో అసలు వైద్య, ఆరోగ్య శాఖ ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. కూటమి ప్రభుత్వ వైఫల్యానికి తురుకపాలెం మరణ మృదంగమే నిదర్శనం అన్నారు. గత 5 నెలలుగా వరుస మరణాలు సంభవిస్తుంటే వైద్యారోగ్య శాఖ ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. అసలు మంత్రి సత్య కుమార్ యాదవ్ నిద్ర పోతున్నారా అంటూ మండిపడ్డారు. ఇకనైనా సర్కార్ మేల్కోవాలని , వెంటనే గ్రామస్థులను భయాందోళనల నుంచి రక్షించాలని కోరారు.