ప్రధాని మోదీతో మంత్రి లోకేష్ భేటీ
NEWS Sep 05,2025 02:45 pm
ఢిల్లీ లో ప్రధాని నరేంద్ర మోడీతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు సహకారం అందించాలని కోరారు. ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఐటి, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా యోగాపై రూపొందించిన పుస్తకాన్ని ప్రధానికి లోకేష్ బహూకరించారు.