హైదరాబాద్: విద్యలో సంస్కరణ వల్లే ఢిల్లీలో కేజ్రీవల్ 2వ సారి, 3వ సారి సీఎం అయ్యారని, తెలంగాణ టీచర్స్ మంచిగా పని చేస్తే తాను 2వ సారి, 3వ సారి సీఎం అవుతానని సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి పురస్కారాలు అందజేశారు. మాదాపూర్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన గురు పూజోత్సవం ఘనంగా జరిగింది.