ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది: ఎమ్మెల్యే పాయం
NEWS Sep 05,2025 01:43 pm
ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి విద్యా బుద్ధులు అందించడం ఒక వరమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరులో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఎంతో కీలకమని కొనియాడారు. కార్యక్రమంలో ఎంఈఓ స్వర్ణ జ్యోతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.