బాధితులకు సెల్ ఫోన్లను అప్పగించిన పోలీసులు
NEWS Sep 05,2025 01:43 pm
పినపాక మండలంలో CEIR పోర్టల్ ద్వారా ట్రేస్ చేసిన మొబైల్ ఫోన్లను బాధితులకు ఈ.బయ్యారం పోలీసులు అందజేశారు. సీఐ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నవారికి తిరిగి అందించడంతో బాధితులు ఉపశమనం పొందారని సీఐ తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ పోయినప్పుడు CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తే సులభంగా ట్రేస్ చేసి తిరిగి పొందవచ్చని, ప్రజలు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.