ఖైరతాబాద్ గణేష్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది
NEWS Sep 05,2025 01:25 pm
71 ఏళ్ల క్రితం ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ ఈరోజు 69 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడని ప్రశంసించారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలోనే ఖైరతాబాద్ గణేష్ కు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రతి ఏటా ఘనంగా గణేష్ ఉత్సవాలు చేస్తున్న కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్నానని, ఇప్పుడు సీఎంగా పూజలు చేయడం ఆనందంగా ఉందన్నారు.