నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
NEWS Sep 05,2025 10:33 am
జగిత్యాల పట్టణంలో గణేశ నిమజ్జనం రెండు రోజుల పాటు శుక్రవారం, శనివారాల్లో జరగనుంది. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 340 మండపాల్లో తొలి రోజు 120, రెండో రోజు 220 విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం చింతకుంట చెరువు వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రత్యక్షంగా పరిశీలించారు. నిమజ్జనం వేడుకల నేపథ్యంలో రెండు రోజులు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు.