ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేయాలి : సీఎం
NEWS Sep 05,2025 10:27 am
ఎస్ఎల్బీసీ పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కావడానికి వీలు లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేవలం నల్గొండ జిల్లాకే కాదు తెలంగాణకు సైతం అత్యంత కీలకం అన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా నీళ్లు ఇవ్వడానికి SLBCలో అవకాశం ఉందన్నారు. శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ వరకు ఉన్న సమస్యలపై తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అటవీ శాఖ అనుమతులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డిసెంబర్ 9, 2027లోగా ఎస్ఎల్బీసీని పూర్తి చేసి తెలంగాణ జాతికి అంకితం ఇవ్వాలన్నారు.