అంబటి రాంబాబుపై విజిలెన్స్ విచారణ
NEWS Sep 05,2025 10:08 am
ఏపీ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఝలక్ ఇచ్చింది. ఆయనపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఆదేశించింది. వైసీపీ ఐదేళ్ల పరిపాలనా కాలంలో కేబినెట్ లో కీలక పాత్ర పోషించిన రాంబాబు అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది. జగనన్న కాలనీల కోసం భూములను ఎకరం రూ.10 లక్షలకు కొని ప్రభుత్వానికి రూ.30 లక్షలకు అమ్మినట్లు గుర్తించినట్లు స్పష్టం చేసింది.