ప్రజల కోసమే చాయ్ పే చర్చ
NEWS Sep 05,2025 09:47 am
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసు కునేందుకే బీజేపీ ఆధ్వర్యంలో ఏపీలో చాయ్ పే చర్చా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. విజయవాడలో ఆయన టీ తాగుతూ ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్బంగా వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీశారు. సమస్యల పరిష్కారం కోసం తాము కూటమి సర్కార్ కు, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి తెలియ చేస్తామన్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు మాధవ్.