బీసీల వ్యతిరేకి ప్రధాని మోదీ
NEWS Sep 05,2025 09:35 am
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రధాని మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీనని చెప్పుకుని పదవి చేపట్టిన ఆయన ఆతర్వాత బీసీల గురించి పట్టించు కోవడం లేదని వాపోయారు. మోదీ పూర్తిగా బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేవలం ఒకే ఒక్క శాతం ఉన్న బ్రాహ్మణులు 45 మంది కేంద్ర క్యాబినెట్ లో ఉన్నారని, 60 శాతం ఉన్న బీసీలు కేంద్ర క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారని ఆయన ప్రశ్నించారు.