ఉపాధ్యాయుల సన్మానించిన ఆర్యవైశ్యులు
NEWS Sep 05,2025 05:02 am
మెట్‌పల్లి: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 40 మంది ఆర్యవైశ్య ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షులు మైలారపు లింబాద్రి, పట్టణ అధ్యక్షులు మైలారపు రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో ఉపాధ్యాయులకు బహుమతులు అందజేశారు. బండారి శివ, ఎల్మీ రవి, దొంతుల లక్ష్మీనారాయణ, కొత్త నవీన్, కోట కిరణ్, చాడ సురేష్, చాడ చందు, గంప శ్రీనివాస్, కట్కం శంకర్, చిటిమిల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.