బొప్పాయి రైతుల ఆందోళన – వాహనాల నిలిపివేత, గడ్డి దహనం
NEWS Sep 05,2025 10:36 am
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో బొప్పాయి రైతులు గిట్టుబాటు ధరలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సిద్ధారెడ్డి పల్లె వద్ద ఆగ్రహంతో రగిలిపోయిన రైతులు వాహనాలను అడ్డుకుని, వాటిలో ఉన్న గడ్డిని దగ్ధం చేశారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు. గిట్టుబాటు ధరలు నిర్ధారించాలని డిమాండ్ చేస్తూ బంద్ చేపట్టిన రైతులు, సమస్యపై కలెక్టర్ తక్షణమే నిర్ణయం తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని కోరారు.