సీఎస్కే చైర్మన్ గా ఎన్. శ్రీనివాసన్
NEWS Sep 05,2025 09:03 am
చెన్నై సూపర్ కింగ్స్ ఎలెవన్ జట్టు చైర్మన్ గా ఎన్. శ్రీనివాసన్ నియమితులయ్యారు. తాజాగా జరిగిన సీఎస్కే బోర్డు సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. శ్రీనివాసన్ రాకతో తమ జట్టుకు అదనపు బలం చేకూరిందన్నారు. జట్టుకు సంబంధించిన టోర్నీలతో పాటు ఆస్తులను కూడా ఆయన పర్యవేక్షిస్తారని వెల్లడించారు. ప్రస్తుతం సీఎస్కేకు ఎంఎస్ ధోనీ కెప్టెన్ గా ఉన్నాడు.