ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలి
NEWS Sep 05,2025 08:44 am
చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరు ధరించాలని పిలుపునిచ్చారు మంత్రి సవిత. దేశంలో అన్ని ప్రాంతాల నుంచి విభిన్న రకాల చేనేత వస్త్రాలను నగర ప్రజలకు అందుబాటులో ఉండేలా చేనేత, హస్తకళల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రోజు రోజుకు చేనేత వస్త్రాలకు ఆదరణ పెరుగుతోందన్నారు. తమ ప్రభుత్వం వీవర్స్ కోసం అనేక పథకాలను తీసుకు వచ్చిందని చెప్పారు.