ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం
NEWS Sep 04,2025 09:27 pm
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మెట్ పల్లి పట్టణానికి చెందిన గుర్రాల సుధాకర్ ఉత్తమ ఉపాధ్యాయుడుగా అవార్డును అందుకున్నారు. మల్లాపూర్ మండలం ఫ్యాక్టరీ చిట్టాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో స్కూల్ అసిస్టెంట్, గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుర్రాల సుధాకర్ కు మండల వనరుల కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల విద్యాధికారి కే.దామోదర్ రెడ్డి సన్మానించి అవార్డును అందజేశారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా సుధాకర్ అవార్డును అందుకున్న సందర్భంగా మెట్‌పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల 1992 -1993 పదవతరగతి విద్యార్థులు శాలువాతో సత్కరించి, అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ.. సంబరాలు జరుపుకున్నారు.