పదోన్నతిపై బ్యాంక్ మేనేజర్ యోగేష్‌కు సన్మానం
NEWS Sep 05,2025 10:45 am
కామారెడ్డి నియోజకవర్గంలోని చిన్న మల్లారెడ్డిలో గల తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న యోగేష్ పదోన్నతి పొంది ఆదిలాబాద్‌కు వెళుతున్న సందర్భంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ విశ్వనాథం, శ్వేత, క్యాషియర్ సీఎస్పీలు స్వామి, శ్వేత, రాజు, హేమలతతో పాటు గ్రామ సంఘ అధ్యక్షులు సరస్వతి, భారతి, కళావతి, సి.ఎ.లు సరిత, విజయ, విమల తదితరులు పాల్గొన్నారు. యోగేష్ గారి సేవలను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాల్లో నిలవాలని ఆకాంక్షించారు.