ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది – చిట్వేల్‌లో ఘన వేడుక
NEWS Sep 05,2025 10:38 am
చిట్వేల్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులే ముందడుగు వేసి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి దీపప్రజ్వలన చేశారు. ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి గొప్పదని, రాధాకృష్ణ గారి జయంతినే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని వివరించారు. విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానించగా, విద్యార్థులు ఉపాధ్యాయుల కోసం క్రీడా పోటీలు నిర్వహించారు. ఇదే పాఠశాల ఉపాధ్యాయులు పి.రాజశేఖర్, ఏ.శివన్నారాయణ, జి.శ్రీకాంతి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడంపై సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.