ఇసుక డంపులను సీజ్ చేసిన ఎమ్మార్వో
NEWS Sep 05,2025 10:46 am
కథలాపూర్ మండలంలోని బొమ్మేనా గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను ఎమ్మార్వో వినోద్ కుమార్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీజ్ చేసిన ఇసుకను శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫేజ్–1, ఫేజ్–2, కలికోట సూరమ్మ చెరువుకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నవీన్ కుమార్, ఆర్‌ఐ నాగేష్ పాల్గొన్నారు.