లొంగుపర్తి సచివాలయంలో రాజ్మా విత్తనాల పంపిణీ
NEWS Sep 05,2025 10:38 am
అనంతగిరి మండలం లొంగుపర్తి సచివాలయం రైతు సేవా కేంద్రంలో రాజ్మా విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. సచివాలయం వ్యవసాయ అధికారి జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జై భారత్ నేషనల్ పార్టీ అరకు పార్లమెంట్ అధ్యక్షుడు బడ్నైన చంటి బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రైతులకు స్వయంగా విత్తనాలను అందజేశారు. 90% సబ్సిడీతో అందిస్తున్న ఈ విత్తనాలను సద్వినియోగం చేసుకుని రాజ్మా సాగును విస్తరించాలని ఆయన రైతులను సూచించారు.