ఓ పక్క యూరియా బస్తాలు దొరకక రైతులు అవస్థలు పడుతుంటే మరోపక్క యూరియా బస్తాలు మాత్రం పక్కదారి పడుతున్నాయి. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో యూరియా బస్తాలు పక్కదారి పడుతున్నాయంటూ రైతులు ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలోని ఆగ్రోస్ షాపులో ఉన్నటువంటి బస్తాలను యాజమాన్యం పక్కదారి పట్టిస్తుండడంతో ఇదేంటని రైతులు నిలదీశారు. అధికారులు స్పందించి ఈ షాప్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.