ఈ-కేవైసీ పూర్తయిన రైతులకు నగదు జమ
NEWS Sep 04,2025 05:59 pm
అన్నదాత సుఖీభవ పీయం కిసాన్ పథకం ద్వారా అర్హత గల ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000/- ఆర్థిక సహాయం అంద చేసేందుకు తొలి విడతగా ఇప్పటికే 7 వేల రూపాయలను రైతులకు జమ చేసామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అర్హత కలిగి ఉండి కూడా లబ్ది పొందని రైతుల కోసం ఆగష్టు 3వ తేదీ నుండి 20 వ తేదీ వరకు అన్నదాత సుఖీభవ పోర్టల్ లోని గ్రీవెన్స్ మోడ్యూల్ అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. అగ్రికల్చర్ అసిస్టెంట్ లు రైతుల ఫిర్యాదులు పోర్టల్ లో పరిచారని తెలిపారు.