ముస్లిం మత పెద్దలతో డిఎస్పీ సమావేశం
NEWS Sep 04,2025 06:01 pm
మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి సూచించారు. గురువారం డిఎస్పి కార్యాలయం లో ముస్లిం నాయకులు తో ఆయన సమావేశం నిర్వహించారు. వినాయక చవితి ఊరేగింపు వేడుకలు , మిలద్ ఉన్ నబి పండగ సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 12 వ తేదీన శుక్రవారం మిలద్ పండుగ జరుపుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ముస్లిం సోదరులు డీఎస్పీకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మణుగూరు సిఐ నాగబాబు , ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.