ఓసి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
NEWS Sep 04,2025 06:01 pm
మణుగూరు ఓసి భూసేకరణ లో నిర్వాసితులకు న్యాయం చేసి, దళారుల ఆగడాలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని అధికారులను సామాజిక కార్యకర్త కర్నే బాబురావు కోరారు. గురువారం మణుగూరు తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ అద్దంకి నరేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళారుల ఆగడాలను తగ్గించి సింగరేణికి నష్టం నివారించాలన్నారు. ఆర్డీవో, అదనపు కలెక్టర్ మృణాల్ శేష్ఠ కు సైతం వినతి పత్రాలు అందించినట్లు తెలిపారు.