సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన
NEWS Sep 04,2025 06:02 pm
సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన అవసరమని మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి తెలిపారు. మణుగూరు శ్రీవిద్య కాలేజీలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ ల పట్ల అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన స్వయంగా వివరించారు. అనవసరమైన లింకులు మొబైల్ లో ఓపెన్ చేయవద్దని విద్యార్థులకు సూచించారు. సైబర్ క్రైమ్ కంప్లైంట్ నెంబర్ 1930 ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు సీఐ నాగబాబు , శ్రీవిద్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.