1930 నెంబర్ మీ ఫోన్ లో సేవ్ చేసుకోండి
NEWS Sep 04,2025 06:03 pm
సైబర్ నేరాల పట్ల యువతకు అవగాహన ఉండాలని ఈ బయ్యారం ఎస్ఐ సురేష్ సూచించారు. పిరపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో యువతకు ఆయన ప్రత్యేక అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగి పోతున్నాయని , దానికి కారణం గ్రామాల్లో అవగాహన లేకపోవడం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అమాయక ప్రజలను టార్గెట్ గా చేసి సైబర్ నేరాలు చేస్తున్నారని తెలిపారు. 1930 నెంబర్ ప్రతి ఒక్కరు తమ ఫోన్ లో సేవ్ చేసుకోవాలని కోరారు.