సజ్జల భార్గవపై కేసు బక్వాస్ : సజ్జల
NEWS Sep 04,2025 04:56 pm
తన తనయుడు సజ్జల భార్గవ రెడ్డిపై నమోదు చేసిన కేసు బక్వాస్ అంటూ కొట్టి పారేశారు వైసీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణా రెడ్డి. కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసు నమోదు చేశారన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా పరిష్కరించిన పాపాన పోలేదన్నారు. ఓ వైపు యూరియా దొరకక నానా ఇక్కట్లు పడుతుంటే ప్రభుత్వం మాత్రం కేవలం వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని పని చేస్తోందంటూ ధ్వజమెత్తారు.