దుష్ప్రచారంపై కేబినెట్ సబ్ కమిటీ
NEWS Sep 04,2025 04:45 pm
ప్రభుత్వంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. మంత్రులు వంగలపూడి అనిత, కొలుసు పార్థసారథి, పయ్యావుల కేశవ్ లతో కూడిన సబ్ కమిటీ ఫేక్ న్యూస్ నివారణకు చట్టం తీసుకు రావాలని నిర్ణయం తీసుకుంది. అబద్దాలను ప్రచారం చేసే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.