వరద బాధితులకు సీఎం పరామర్శ
NEWS Sep 04,2025 04:35 pm
కామారెడ్డిలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి . వరదల కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్నది. ప్రభావిత ప్రాంతాలలో బాధితులను పరామర్శించారు. రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇప్పటికే వరదల కారణంగా దెబ్బతిన్న జిల్లాలకు రూ. 10 కోట్ల చొప్పున మంజూరు చేశామన్నారు. భవిష్యత్తులో వరదల వల్ల ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడతామన్నారు. కొట్టుకు పోయిన రోడ్లు, చెరువు కట్టలు, ఇతరత్ర దెబ్బతిన్న వాటిని త్వరితగతిన పునర్నిర్మిస్తామని చెప్పారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామమన్నారు.