వినాయకుడికి 108 ప్రసాదాలతో నైవేద్యం
NEWS Sep 04,2025 03:42 pm
కోరుట్ల పోచమ్మవాడలో గ్రీన్ హోప్ యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన యాలకుల గణేశుడు భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. వినాయక మండపంలో గణపయ్యకు 108 ప్రసాదాలతో నైవేద్యం సమర్పించారు. ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా, సాయంత్రం మరల నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ హోప్ యూత్ కమిటీ సభ్యులు, మహిళా భక్తులు పాల్గొన్నారు. పర్యావరణం, ప్రజారోగ్యం కాపాడటానికి యాలకుల గణేశుడు ఉపయోగపడతాడని నిర్వాహకులు తెలిపారు.