ప్రధాన అనుచరులతో కవిత రహస్య భేటీ
NEWS Sep 04,2025 03:04 pm
BRS పార్టీ నుంచి కవిత సస్పెన్షన్, ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా అనంతరం ఆమె తన ప్రధాన ఆనుచరులు, జాగృతి ముఖ్య నేతలతో రహస్య సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. కొత్తగా పార్టీ పెడితే.. తన వెంట నడిచేది ఎవరని ఆరా తీసినట్లుగా టాక్. ఇక బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ.. అక్కడ ప్రాధాన్యం దక్కని ముఖ్య నాయకులు, మాజీ ఎమ్మెల్యేల లిస్టును తయారుచేసే పనిపై కవిత ఫోకస్ పెట్టారట. ఉద్యమంలో యాక్టివ్‌గా పని చేసిన ఉద్యమకారులను జాగృతిలో చేరాలని కవిత కోరబోతున్నట్లుగా తెలుస్తోంది.