వినాయకుడికి 51 ప్రసాదాలతో నైవేద్యం
NEWS Sep 04,2025 02:43 pm
మెట్‌పల్లి పట్టణంలోని టీచర్స్ కాలనీలో శ్రీ సిద్ధి వినాయక మండపం లో వినాయకుడికి 51 ప్రసాదాలతో భక్తులు నైవేద్యం సమర్పించారు. ఉదయం నుండి ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించి, సాయంకాల వేళ గణపయ్యకు నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక కార్యనిర్వహణ కమిటి సభ్యులు, మహిళ భక్తులు పాల్గొన్నారు.