‘పునరుద్ధరణ సూక్ష్మ అర్థశాస్త్రం’ పుస్తకావిష్కరణ
NEWS Sep 04,2025 12:06 pm
మెట్‌పల్లి: ‘పునరుద్ధరణ సూక్ష్మ అర్థశాస్త్రం (రివైజ్డ్ మైక్రో ఎకనామిక్స్)’ పుస్తకాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఆవిష్కరించారు. పుస్తకం రచనలో విశేష సేవలందించిన రిటైర్డ్ ఎకనామిక్స్ ఉపన్యాసకులు డా. అక్కినపల్లి మీనయ్య కృషిని ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు. కళాశాల ప్రిన్సిపాల్ వెంకయ్య, వైస్ ప్రిన్సిపల్ దేవన్న, అధ్యాపకులు మనోజ్ కుమార్, రాజ్ కుమార్, సత్యం, అంజయ్య, శ్రీకాంత్, దశరథం తదితరులు పాల్గొన్నారు.