తిరుచ్చి నుండి విజయ్ ప్రచార యాత్ర
NEWS Sep 04,2025 10:24 am
టీవీకే పార్టీ కీలక ప్రకటన చేసింది. పార్టీ చీఫ్ , ప్రముఖ నటుడు దళపతి విజయ్ ఈనెలాఖరు నుంచి పాదయాత్ర చేపడతారని తెలిపింది. ఇందులో భాగంగా తమళనాడు లోని తిరుచ్చి నుంచి ఈ యాత్రకు శ్రీకారం చుడతారని వెల్లడించింది. ఇటీవలే మధురై వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. 4 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రచార యాత్ర చేపడతానని ప్రకటించారు.