జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు
NEWS Sep 04,2025 07:29 am
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం నాలుగు శ్లాబ్‌లు ఉండగా ఇకపై రెండు శ్లాబ్‌లు మాత్రమే ఉండనున్నాయి.12 శాతం, 28 శాతం శ్లాబ్‌లు తొలగింపునకు జీఎస్టీ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై కేవలం 5, 18 శాతం శ్లాబ్‌లు మాత్రమే ఉండనున్నాయి. ఈ మేరకు అధికారికంగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు.