కావాలనే పొంగులేటికి ఇళ్ల శాఖ ఇచ్చాం
NEWS Sep 04,2025 07:22 am
సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ ఇవ్వమని పొంగులేటి అడగ లేదన్నారు. ధరణి దరిద్రం పోవాలి, పేద వాడి సొంతింటి కల నెరవేరాలని, దానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినే కరెక్ట్ అని ఈ శాఖలు ఇచ్చామన్నారు. అగ్రనేతలను ఒప్పించి పొంగులేటికి ఈ బాధ్యత ఇవ్వడం జరిగిందన్నారు. ఆయన సమర్థవంతంగా పని చేస్తున్నారంటూ కితాబు ఇచ్చారు.