18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
NEWS Sep 04,2025 07:08 am
ఈనెల 18వ తేదీ నుంచి ఏపీ శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అమరావతికి సంబంధించి ఇటీవల జరిగిన SIPB, CRDA సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించనుంది కేబినెట్. భూసేకరణ జరిపేందుకు CRDAకు పాలనా పరమైన అనుమతులు మంజూరు చేయనుంది. రూ.53 వేల కోట్ల పెట్టబడులు, 83 వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పలు పరిశ్రమలకు అనుమతులు ఇవ్వనుంది.